దీపో జ్యోతిః పరం బ్రహ్మ దీపః సర్వతమోపహః

November 24, 2009

శ్లో II
దీపో జ్యోతిః పరం బ్రహ్మ దీపః సర్వతమోపహః ,
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమో2స్తు తే .

దీపము జ్యోతిస్స్వరూపమైనది ; అదియే పరబ్రహ్మము . దీపము చీకటి నంతను పారద్రోలునట్టిది . ఈ దీపము వల్లనే సర్వకార్యములును సుగమము లగుచున్నవి . అట్టి సంధ్యాదీపమా ! నీకివే నా నమస్సులు .

పూర్వపు రోజుల్లో సాయంకాలమయి దీపం పెట్టగానే చాలామంది స్త్రీలు ఆ దీపానికి నమస్కారం చేస్తుండటాన్ని చూచేవాళ్ళం. ఈరోజుల్లో కూడా అంటే విద్యుద్దీపాలు వచ్చింతర్వాత కూడా చాలామంది ముఖ్యంగా స్త్రీలు సాయంకాలపు దీపాన్ని వెలిగించగానే ( స్విచ్చి వేయగానే ) దానికి నమస్కారం చేయటం చాలాచోట్ల గమనించాను  . ఇటువంటి చర్యలను బట్టే ఇంకా మన ఆచార వ్యవహారాలు పూర్తిగా అడుగంటిపోలేదని అనిపిస్తుంది .

3 comments:

రవి said...

దీపం మగవారు కూడా వెలిగించవచ్చా? ఏ తైలం వాడాలి?

Unknown said...

మగవారూ వెలిగించవచ్చు . నువ్వుల నూనె శ్రేష్ఠమైనది.

ujalanachtman said...

Tzedya titanium tube : 3mm 3D pattern - Baojititanium
Tzedya Titanium titanium tubing Tzt 1.3M3D pattern 제주도 출장마사지 - 2 M3D 대구광역 출장마사지 Pattern. Tzedya TitaniumTz 1.3M3D 의왕 출장안마 pattern - 3 M3D pattern - 3 M3D pattern - 3 경산 출장샵 M3D pattern - 3 M3D pattern