జాడ్యం ధియో హరతి సిఞ్చతి వాచి సత్యం

July 6, 2009

శ్లోII
జాడ్యం ధియో హరతి సిఞ్చతి వాచి సత్యం
మానోన్నతిం దిశతి పాప మపాకరోతి,
చేతః ప్రసాదయతి దిక్షు తనోతి కీర్తిం
సత్సఙ్గతిః కథయ కిం న కరోతి పుంసామ్. 19

తే.
సత్యసూక్తి ఘటించు ధీ జడిమ మాన్చు
గౌరవ మొసంగు జనులకు గలుష మడఁచుఁ
గీర్తిఁ బ్రకటించుఁ జిత్తనిస్ఫూర్తిఁ జేయు
సాధుసంగంబు సకలార్థ సాధనంబు.
తా.
సత్పురుషుల సహవాసము జనులకు సత్యవాక్కులను గూర్చును; బుద్ధిమాంద్యమును తొలగించును; గౌరవము కలిగించును; పాపమును నశింపజేయును; కీర్తిని దెలుపును; బుద్ధిని వికసింపజేయును ; సత్సంగము సకల కార్యముల సాధించును.

అందుచేత సజ్జన సాంగత్యం ఎప్పుడూ అవసరమే. ఎవరు సజ్జనులో ఎవరు కాదో తెలుసుకోవటం లోనే మన తెలివితేటలని బాగా ఉపయోగించుకోవాలి.

0 comments: