జన్మనా జాయతే శూద్రః , కర్మణా జాయతే ద్విజః ,

December 8, 2009

శ్లో II
జన్మనా జాయతే శూద్రః , కర్మణా జాయతే ద్విజః ,
వేదపాఠం తు విప్రాణాం , బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణాః . మహాభారతం.

సర్వజనములును జన్మచే శూద్రులుగనే పుట్టి , కర్మలచే ద్విజత్వము నొందుచున్నారు . వారిలో కొందరు వేదాధ్యయనముచే విప్రులయి బ్రహ్మజ్ఞానమును పొంది బ్రాహ్మణులైరి .

బ్రాహ్మణత్వాన్ని పొందే మార్గం ఇక్కడ విస్పష్టంగా చెప్పబడింది. ఈ మార్గాన్నే మనమందరం అనుష్టించాల్సి ఉంది.

5 comments:

Sandeep P said...

చక్కనైన విషయం చెప్పారు అండి. పూర్తిగా బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకునే శక్తి ఈ కలియుగంలో మానవమాత్రులకు ఉండదు కాబట్టి కనీసం మంచిమనుషులుగా ఉండటం అవసరం.

Anonymous said...

బ్రాహ్మణుత్వం అంటే బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే నిండార రాజు నిద్రయు ఒకటే అండనే బంటు నిద్ర అదియును ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటి చండాలుడుండేటి సరిభూమి యొకటే..

Anonymous said...

ఇదొక్కటే కరెక్టు మిగిలినవి అన్నీ కృతకం ఒకడు ఈ శ్లోకం లో కొన్మాని పదాలు మార్చి మనుస్మృతి లోని శ్లోకమనీ మరొకడు ఏకంగా అవే మార్చిన పదాలతో ఋగ్వేదం లోని ఆత్రేయ సంహితలోని మంత్రమూ/ లేక ఋక్ అనే అర్ధం వచ్చేలా వ్రాశాడు. ఘోరం ఘోరం। మహీధర జగన్మోహనరావుగారి సూక్తి ముక్తావళి శ్లోకమే కరెక్టు।

Anonymous said...

Thanks 🙏
This is correct!
I wrote above ⬆️ in Telugu about distortions by fake pundits all over internet.
Thanks 🙏 again
Pandu Ranga Vittal Kuchibhotla
Anaheim CA USA 🇺🇸

Anonymous said...

84 లక్షల జీవరాశులలో మనవ జన్మ శ్రేష్టం. అందునా గాయత్రీ మంత్ర అనుష్టానార్హత గలిగిన విప్ర జన్మ. బ్రాహ్మణుడిగా పుట్టినందుకు కనీసం నిత్య సంధ్యోపాసనతో బ్రాహ్మణుడిగా బతుకుతూ తరిద్దాం. మానవ జన్మ ఇచ్చినందుకు మనిషిగా బతకడమే భగవంతునికి మనం కృతజ్ఞత చూపించే విధానం.