అసారే ఖలు సంసారే , సార మేతచ్చతుష్టయం ,

December 9, 2009

శ్లో II

అసారే ఖలు సంసారే , సార మేతచ్చతుష్టయం ,
కాశ్యం వాసః సతాం సంగో , గంగాంభః శంభుసేవనమ్.

సారములేని యీ సంసారమున సారభూతమైనవి నాలుగే వున్నాయి ; అవి యేవన కాశీనివాసము , సత్పురుషుల స్నేహము , గంగాస్నానము , ఈశ్వరసేవ. 
ఈ శ్లోకానికి నా తెలుగు పద్యానువాదం.
ఆటవెలది.
సారహీనమైన సంసారమందున
సార సహిత మయిన వవియె నాల్గు
కాశియందు నునికి, సజ్జన స్నేహమూ
గంగ యందు మునుక శంభు సేవ.
యతి స్థానాలు తప్పైనవనుకుంటాను. పెద్దలు మన్నించాలి.

2 comments:

చింతా రామ కృష్ణా రావు. said...

సారహీనమైన సంసారమందున
సార మైన నాల్గు సలుపఁ దగును.
కాశియందు నునికి, గౌరవాత్ముల మైత్రి
గంగ మునుక; నీలి కంఠు సేవ.

Gouri Sharma said...

ధన్యోస్మి 🙏💐