విద్యా వినయ సంపన్నే , బ్రాహ్మణే గవి హస్తిని

December 1, 2009

శ్లోII
విద్యా వినయ సంపన్నే , బ్రాహ్మణే గవి హస్తిని
శుని చైవ శ్వపాకే చ , పండితా స్సమదర్సినః II 5-18

విద్యా వినయ సంపన్నుడైన ఉత్తమబ్రాహ్మణునియందు , గోవునందు , ఏనుగునందు , కుక్కయందు , ఛండాలునియందు - అన్నిటియందును పండితులు సమదృష్టినే కలిగివుంటున్నారు . ( అనగా సర్వమునందు బ్రహ్మమును చూచువారే పండితులని యర్థము ) .

మనమందరం పండితులుగా మారాలి అంటే అలవాటు చేసుకోవాల్సిన మొదటి లక్షణం గుఱించి తెలుసుకున్నాం. దీనిని అందరూ పాటించటానికి ప్రయత్నించ గలరని నా ఆశా, మఱియు ఆకాంక్షాను .
ఈ టపా సూక్తిముక్తావళి లో నూఱవ టపా.

2 comments:

రాఘవ said...

ఏమైనా భగవద్గీతకు సాటి భగవద్గీతే కదండీ!

* * *

ఈ మధ్యన మీరు ఈ బ్లాగులో పెద్దగా వ్రాయడం లేదూ అనుకుంటున్నాను, మళ్లీ ప్రారంభించారన్నమాట. శుభం.

Unknown said...

మా నాన్నగారు సూక్తిముక్తావళి పుస్తకాన్ని తనతో తీసుకొని వెళ్ళారు. అది ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఎవరికో చదవడానికిచ్చారట . అది తిరిగి రాలేదు . మొన్నను నేనూ రాకేశ్వర్ కలసి విశాలాంధ్రకి వెళ్ళి దాన్ని వెతకిపట్టుకొని కొని తీసుకొచ్చాను. ఇంక అప్పటినుంచి తిరిగి మొదలుపెట్టానన్నమాట . అదీ సంగతి .