November 2, 2008
శ్లోII
మాతాసమం నాస్తి శరీరపోషణం!
చింతాసమం నాస్తి శరీరశోషణం!
భార్యాసమం నాస్తి శరీరతోషణం!
విద్యాసమం నాస్తి శరీరభూషణం!!
తల్లి వలె శరీరమును పోషించు వారెవ్వరూ ఉండరు.అట్లే శరీరమును శుష్కింపజేయుటలో చింతవంటి దింకొకటిన్నీ లేదు.శరీరమునకు సుఖసంతుష్టుల నొసగుటలో భార్యకు మరెవ్వరూ దీటు గాజాలరు.శరీరమునకు యింక ఏ అలంకారమున్నూ విద్యవంటి మేల్తొడవు కానేరదు.
తల్లికి,చింతకూ,భార్యకి,విద్యకూ,మనిషి శరీరానికి ఏవేని ఏయే విధంగా ఉపయోగపడుతుంటాయో మంచి మంచి పదాలు అంటే పోషణం,శోషణం,తోషణం,భూషణం అనే వాటితో చెప్పిన అందమైవ అతి సులభమయిన శ్లోకం ఇది.ధారణ చెయ్యటం చాలా సులభం.
మంచి అనుప్రాస.
1 comments:
మీరు వ్రాసిన ఈ సూక్తులు బాగున్నాయండీ. ఉపయోగమైనవి, ఆలోచింపదగినవి.
శ్రీవాసుకి, http://srivasuki.wordpress.com
Post a Comment