November 1, 2008
శ్లో!!
అహింసా ప్రథమం పుష్పం పుష్ప మింద్రియనిగ్రహం!
సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విషేషతః!
శాంతిః పుష్పం తపః పుష్పం ధ్యానపుష్పం తథైవచ!
సత్య మష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్!!
అహింస,ఇంద్రియనిగ్రహము,సర్వభూతదయ,క్షమ,శాంతి,తపము,ధ్యానము,సత్యము - యీ ఎనిమిది గుణములున్ను విష్ణుదేవునికి అత్యంత ప్రీతికరములైన పుష్పములు. ఈ పువ్వులచేత పూజించిన విష్ణువు తృప్తుడగును గాని యితరపూవులచేత గాదుసుమా.
సుగుణాలనన్నీ పుష్పాలతో పోలుస్తూ ఆయా సుగుణము లెవరెవరి వద్ద వుంటాయో, అట్టివారు భగవంతునికి ప్రేమపాత్రులవుతారనడం - ఆ యా సుగుణాలను అందరూ అలవరచుకోమని ప్రబోధించటం అన్నమాట.
6 comments:
మంచి శ్లోకంతో ప్రారంభించారు. మీ email address ఇవ్వగలరా నా mail vijaya.mohan59@gmail.com హరేకృష్ణ
my email address
narasimharaomallina@gmail.com
..పద్యం..భావం గొప్పగా వుంది..రేపు మా కాలేజ్ పిల్లలకు చెబుతాను..!
sarsvatii putrulaku vamdanam
చాలా పెద్ద మాట వాడారు.నేనొక నిత్యవిద్యార్థినే.బ్లాగ్లోకానికి స్వాగతం.మోదలు పెట్టండి మరి.ఆలస్యం దేనికి?
చాలా బావుంది. మానసిక శాంతి కలిగించే సూక్తులు. తప్పులు లేకుండా వ్రాసి అందించారు.
Post a Comment